Hyd: ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-3 రింగ్ మెయిన్-1 టోలిచౌకి వద్ద ఎస్బీఐ బ్యాంక్ నుండి ఆర్చీస్ స్టోన్ వరకు గల 1400 ఎంఎం డయా ఎమ్ఎస్ పంపింగ్ మెయిన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ ప‌నుల మూలంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుండి శనివారం రాత్రి 10 గంటల వరకు 24 గంటల పాటు ఈ పనులు కొనసాగ‌నున్నాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ మేర‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర మంచినీటి స‌ర‌ఫ‌రా & మురుగు నీటి పారుర‌ద‌ల మండ‌లి గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

  • 1. ఓ అండ్ ఎం డివిజన్ నం 3: షేక్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు.
  • 2. ఓ అండ్ ఎం డివిజన్ నం 6: జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాషన్ నగర్, తట్టిఖాన రిజర్వాయర్ ప్రాంతాలు.
  • 3. ఓ అండ్ ఎం డివిజన్ నం 15: గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు.
Leave A Reply

Your email address will not be published.