జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మోడీ హామీ!

న్యూఢిల్లీ (CLiC2NEWS): జమ్ముకశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీల నేతలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం సమావేశం నిర్వహించారు. మూడు గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో పునర్విభజన, రాష్ట్ర హోదా, ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్లు నేతలు చెప్పారు. సమావేశం సందర్భంగా జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోడీ హామీ ఇచ్చారని జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ చీఫ్ మహ్మద్ బుఖారీ వెల్లడించారు.
అలాగే రాష్ట్ర హోదా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధాని చెప్పారని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధిలో భాగంగా ఐదు డిమాండ్లు ఈ సమావేశం ముందుంచినట్లు ఆజాద్ పేర్కొన్నారు.
రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్ పండిట్లకు పునరాసం వంటి తదితర అంశాలను లేవనెత్తినట్లు తెలిపారు.
ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, జమ్ముకశ్మీర్ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న సానుకూల దృక్ఫథంతో తాము బయటకు వచ్చినట్లు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోన్ చెప్పారు.
The talks were held in a good atmosphere today. The Prime Minister heard our issues of all leaders. PM said that election process will begin when delimitation process finishes: J&K Apni Party’s Altaf Bukhari on PM Modi-J&K leaders meet pic.twitter.com/JymTwNPr9N
— ANI (@ANI) June 24, 2021