2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో 17 నామినేషన్లు తిరస్కరణ

హైదరాబాద్‌లో 15, నల్లగొండలో 2

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు వేసిన నామినేష‌న్ల‌లో 170 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. 17 నామినేష‌న్లు తిరస్కరణకు గురయినట్టు బుధవారం అధికారులు తెలిపారు.

  • మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గానికి వేసిన నామినేషన్లలో 96 నామినేషన్లు సరిగ్గా ఉన్నాయని ప్రకటించారు. 15 తిరస్కరించినట్టు చెప్పారు.
  • వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 74 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని వెల్లడించారు. రెండు నామినేషన్లు తిరస్కరించామని తెలిపారు.
  • కాగా నామినేషన్ల ఉపసంహరణకు గ‌డువు ఈ నెల 26. ఎంతమంది బ‌రిలో నిలుస్తారో ఉప‌సంహ‌ర‌ణ తేదీ ముగిసిన త‌ర్వాత‌ తేలనున్నది.
Leave A Reply

Your email address will not be published.