Nandyala: ఆర్‌టిసి బస్సు బోల్తాపడి 20 మందికి గాయాలు

నంద్యాల (CLiC2NEWS): జమ్మల మడుగు నుండి తాడిపత్రికి వెళుతున్న ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలోని కలిమి గుండ్ల మండలం కలవటాల సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ , కండెక్లర్ సహా 20 మంది ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ బస్సును నడుపుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.