పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/11/JOBS-IN-POSTAL-DEPARTMENT.jpg)
దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా మొత్తం 21,413 పోస్టులు ఉన్నాయి. పదో తరగతి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రామీణ డాక్ సేవక్ – బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్ సేవక్ లో పోస్టులు కలవు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోస్టుల వివరాలు.. ఎపిలో 1,215, తెలంగాణలో 519 పోస్టుల కలవు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి లకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన వారికి నెలకు వేతనం ఎబిపిఎం / డాక్ సేవక్‌కు రూ. 10 వేల నుండి రూ. 24,470 .. బిపిఎం పోస్టులకు రూ. 12 వేల నుండి రూ. 29,380 వరకు ఉంటుంది.
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులై ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్లో మార్చి 3వ తేదీలోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100 గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్టి, దివ్యాంగులు , ట్రాన్స్‌విమెన్‌లు ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు సవరణలు మార్చి 6 నుండి 8వ తేదీ వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.