తెలంగాణలో 2,398 కొత్త కేసులు.. ముగ్గురు మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 68,525నమూనాలను పరీక్షించగా.. తాజాగా 2,398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఒక్కరోజులో ముగ్గురు కరోనా మృతిచెందారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,052కి చేరింది. కరోనా బారి నుండి 1,181మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,676 యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ ఎమ్‌సి పరిధిలో ఇవాళ 1,233 కొత్త కేసులు నమోదయ్యాయి.