24న తిరుమలకు రాష్ట్రపతి కోవింద్‌

తిరుమల: ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమలకు రానున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు.

తిరుమలకు చేరుకున్న తమిళనాడు సిఎం పళణిస్వామి..

శ్రీవారి దర్శనార్థం తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి తిరుమలకు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ఆయన సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకి చేరుకున్నారు. రేపు(మంగళవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.