సంక్రాంతికి 26 స్పెషల్ ట్రైన్స్..
చర్లపల్లి నుండి విశాఖకు జనసాధారణ్ రైళ్లు
హైదరాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ జనసాధారణ్ రైళ్లు చర్లపల్లి నుండి విశాఖకు సర్వీసులను అందించనున్నాయి. ఈ నెల 10వ తేదీనుండి 17 వరకు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య అన్ రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
చర్లపల్లి నుండి విశాఖ పట్నం మధ్య జనవరి 10 నుండి 17 మధ్య 16 రైళ్లు .. సికింద్రాబాద్ అర్సికెరె (కర్ణాటక) , బెంగళూరు – కలబుర్గి స్టేషన్ మధ్యం మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేసింది.