దేశంలో కొత్తగా 2,64,202 కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC3NEWS): దేశంలో తాజాగా 2,64,202 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే 6.7% అదనంగా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 12 లక్షలకు పైగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78%గా ఉంది. గడిచిన 24 గంటల్లో 315 మంది కరోనా మహమ్మారికి బలైనారు.
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 5,753కి పెరిగాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లి, కేరళలో ఈ కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కవగా కనిపిస్తోంది.