పరీక్ష లేకుండా నేవీలో 270 పోస్టులు
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/jobs-in-Indian-Navy.jpg)
Indian Navy: భారతీయ నౌకా దళం 270 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. బిటెక్, ఎంఎ, ఎమ్మెస్సి, ఎంబిఎ అర్హతలున్న అవివాహిత మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను అకడమిక్ ప్రతిభతో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ ఎస్ బి) ఆధ్వర్యంలో ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం సబ్ లెప్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి నెలకు వేతనం రూ.లక్ష ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 25. ఇంటర్వూ కేంద్రాలు బెంగళూరు, భోపాల్ , విశాఖపట్నం, కోల్కతా.
మొత్తం పోస్టులు 270
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:
జనరల్ సర్వీస్ -60
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ – 18
నావల్ ఎయర్ ఆపరేషన్స్ ఆఫీసర్ – 22
పైలట్ – 26
లాజిస్టిక్స్ -28
ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో ఖాళీలు 15
టెక్నికల్ బ్రాంచ్
ఇంజినీరింగ్ – 38
ఎలక్ట్రికల్ – 45
నేవల్ కన్స్ట్రక్టర్ – 18
అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు జనవరి 2, 2001 / 2002 – జనవరి 1, 2005/ 2006/ 2007 మధ్య జన్మించి ఉండాలి.
ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి .. జనవరి 2026 నుండి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదు ఇస్తారు. తర్వాత మరో 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో శిక్షణ ఉంటుంది. అనంతరం సబ్ లెప్టినెంట్ హోదాతో విధుల్లోకీ తీసుకుంటారు. వీరికి మూల వేతనం రూ. 56,100 ఉండగా.. డిఎ, హెచ్ ఆర్ె, ఇతర ప్రోత్సాహకాలు కలిపి మెదటి నెల నుండే రూ.1,10,000 జీతం అందుతుంది. ఎంపికైన వారు పన్నెండేళ్లు విధుల్లో కొనసాగుతారు. అనంతరం రెండేళ్లు సర్వీసు పొడిగిస్తారు. మొత్తం 14 ఏళ్ల సర్వీసు అనంతరం ఉద్యోగం నుండి వైదొలుగుతారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.joinindianavy.gov.in/ వెబ్సైట్ చూడగలరు.