సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ లో 28 పోస్టులు

కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నెల 29లోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంది.
సినిమాటోగ్రఫి, రైటింగ్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిట్ మీడియా, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, మేనేజ్‌మెంట్, ఎస్ ఆర్ డి, యానిమేషన్ సినిమా, యానిమేషన్ , ఎడిటింగ్, మేనేజర్ మొదలైన విభాగాల్లో మొత్తం 28 పోస్టులు కలవు.
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో పిజి డిప్లొమా, డిగ్రీతీ పాటు పని అనుభవం ఉండాలి. ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 63 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తు పీజు జనరల్, ఒబిసి, ఇడబ్ల్యుఎస్‌లకు రూ.1200గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి, పిడబ్ల్యు బిడిలకు ఫీజు లేదు.
ప్రొఫొసర్ పోస్టులకు నెలకు వేతనం రూ.1,55,200 అందుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ 1,34,900.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ. 1,13,600, ప్రొడక్షన్ మేనే.ర్ (ఎలక్ట్రనిక్ , డిజిటల్ మీడియా) కు రూ. 87,675.. సౌండ్ ఇంజినీర్, వీడియో గ్రాఫర్, ఎడిటర్, అసిస్టెంట్ బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీర్‌కు రూ. 70,200 వేతనం అందుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు htttps://srfti.ac.in/Vacancy/ వెబ్‌సైట్ చూడగలరు.