3 సర్కార్ కొలువులు గెలిచి..

కరోనాతో ఓడిన విజయం!
పుట్టినరోజు మరునాడే జూనియర్ అసిస్టెంట్ మృతి
కామారెడ్డి (CLiC2NEWS): మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రతిభాశాలి. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి శుక్రవారం కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడికి చెందిన జాజావ్ గంగాధర్‌రావు మూడో కుమార్తె జాజావ్ విజయ (27) తాడ్వాయి తాసిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా రెండేళ్లు విధులు నిర్వహించారు. తర్వాత అటవీ బీట్ అధికారిగా ఎంపికైనా ఉద్యగంలో చేరలేదు. 3 నెలల కిందట వెలువడిన గ్రూప్స్ ఫలితాల్లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక కావడంతో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు వారం క్రితమే కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లివచ్చారు. జ్వరం రావడంతో బుధవారం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించగా విజయతోపాటు తల్లి, అక్కకు కరోనా పాజిటివ్ వచ్చింది. గురువారం విజయకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు రావడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మరణించారు.