Nizamabad: మంత్రి వేముల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన 300 మంది

నిజామాబాద్ (CLiC2NEWS):
తెలంగాణ రాష్ట్రసమితిలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కోమన్‌పల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ, బిజెపి నాయకులు కార్యకర్తలు దాదాపు 300 మంది చేరారు. మంత్రి వేముల వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.