రైల్వే శాఖలో 32వేల కొలువులు
రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దాదాపు 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు ఈ నెల 23 నుండి ఫిబ్రవరి 22వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇదివరకు పదో తరగతితో పాటు ఎన్‌సిఎ సర్టిఫికెట్ లేదా ఐటిఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించింది. తాజాగా విద్యార్హత ప్రమాణాలు సడలించింది. పదోతరగతి లేదా ఐటిఐ డిప్లొమా లేదా నేషనల్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ (NCA) కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే శాఖలో 32 వేల లెవెల్ -1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి విద్యార్హతల విషయంలో కనీస విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.18 వేలు నుండి ప్రారంభమవుతుంది.