మేడారం మహాజాతరకు 3845 ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో జరిగే మేడారం మహాజాతరకు ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందకు నిర్ణయించింది. వచ్చే ఫిబ్రవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో ఒక్క వరంగల్ ఆర్టీసీ నుండే 2,250 బస్సులను నడపనుంది. బస్సులను నిలిపేందుకు 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తున్నది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి జాతరకు వచ్చే భక్తులకు తగిన సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసి అధికారులకు సూచనచేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు గత ఏడాది మాదిరిగానే 3,845 బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యింది.