తెలంగాణలో 44కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయానికి ఎట్ రిస్క్ దేశాల నుండి 248 ప్రయాణికులు రాగా.. ఇద్దరు వ్యక్తులకు పాజివివ్‌గా నిర్థారణయ్యింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్‌కు పంపించారు. దీంతో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారి సంఖ్య 44 కు చేరింది. కాగా.. ఈ వేరియంట్ బారినుండి 10మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ఎట్ రిస్క్ దేశాల నుండి 11,493 మంది ప్రయాణికులు వచ్చారు.