45 రోజులుగా పెరుగుతున్న కోవిడ్ రికవరీలు

న్యూఢిల్లీ: దేశంలో గత 45 రోజుల్లో దేశంలో కోవిడ్19 రికవరీ కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇవాళ (మంగళవారం) ఢిల్లీలో రాజేశ్ భూషణ్ మీడియాతో మాట్లాడారు. మరో వైపు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిందన్నారు. ఏపీ, చత్తీస్ఘడ్, రాజస్థాన్, హర్యానా, యూపీ, కర్నాటక, బెంగాల్, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు 76.7 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ తక్షణ చర్యలు చేపట్టినట్లు రాజేశ్ తెలిపారు. ఐసీయూ బెడ్లను పెంచినట్లు తెలిపారు. టెస్టింగ్‌లను రెండింతలు చేశారు. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే, వాళ్లు తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. టెస్టింగ్ చేయించుకునేందుకు వెనుకాడరాదన్నారు.
ఢిల్లీలో ఉన్న 4వేల కంటోన్మెంట్ ప్రాంతాలను తనిఖీలు చేసేందుకు సిబ్బందిని పెంచుతున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ వెల్లడించారు. జూన్ తర్వాత సగటును టెస్టింగ్ సంఖ్య పెరిగినట్లు చెప్పారు. ఆగస్టు మధ్యలో కోవిడ్ కేసులు తగ్గాయన్నారు. ఇక అక్టోబర్ నుంచి రికార్డు స్థాయిలో కేసులు తగ్గుతున్నట్లు తెలిపారు.
In the last 45 days, the total number of #COVID19 recovered cases has increased and the number of active cases has decreased: Rajesh Bhushan, Secretary, Health Ministry on recent COVID19 situation pic.twitter.com/HQeB25kRbU
— ANI (@ANI) November 17, 2020