ఒఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం

హైదరాబాద్ (CLiC2NEWS): ఒఆర్ ఆర్ పరిధిలోని మొత్తం 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.
మున్సిపాలిటీలు, విలీనం కానున్న గ్రామాలు
- పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ – బాచారం, గౌరెల్లి , కుత్బుల్లాపూర్ తారామతి పేట పంచాయతీలు
- నార్సింగి మున్సిపాలిటి – మీర్జా గూడ గ్రామపంచాయతి
- మేడ్చల్ మున్సిపాలిటి – పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతి
- శంషాబాద్ మున్సిపాలిటి – బహదూర్‌గూడ, పెద్ద గొల్కొండ, చిన్న గొల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ
- తుక్కుగూడ – హర్షగూడ గ్రామ పంచాయతి
- దమ్మాయి గూడ – కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డి పల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి
- నాగారం – బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామలు
- ఘట్ కేసర్ – అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ
- పోచారం – వెంటపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం కానున్నాయి.