సెలవు రోజు కూడా పనిచేయనున్న 52 ఎస్‌బిఐ బ్రాంచ్‌లు..
అమరావతి (CLiC2NEWS): సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 52 ఎస్‌బిఐ బ్రాంచ్‌లు ప్రత్యేకంగా పనిచేయనున్నాయి. రెండు (నేడు, రేపు) రోజలు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు ఫీజుల చలానాలు కట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజి వి. రామకృష్ణ తెలిపారు.
ఆర్ధిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ కోరారు.