తూర్పుగోదావరి జిల్లాలో 61 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
తూర్పు గోదావరి జిల్లా.. హెల్త్ మెడికల్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు ఈ నెల 20లోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 500గానిర్ణయించారు. ఎస్ సి/ ఎస్‌టి / పిడబ్ల్యుబిడిలకు రూ.200గా ఉంది.
మొత్తం పోస్టులు 61
వీటిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2.. 3
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి.. 20
శానిటరి అటెండర్ కమ్ వాచ్‌మెన్.. 38 పోస్టులు కలవు.
పదో తరగతి , ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజి)తో పాటు పని అనుభవం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 52 ఏళ్లు మించరాదు. ఒబిసిలకు మూడేళ్లు, ఎస్‌సి / ఎస్ టిలకు ఐదేళ్లు , దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://eastgodavari.ap.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.