70వ పడిలోకి ప్రధాని మోడీ..
మోడీకి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ 70వ పుట్టినరోజు సందర్భంగా సేవా సప్తా(సర్వీస్ వీక్) పేరుతో దేశ వ్యాప్తంగా పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు, మద్దతుదారులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లడ్డూలను తయారు చేయించడం, కేసులతో హంగామా చేస్తున్నారు. వడోదరలో 20 వేల మందికి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) కింద జీవిత బీమా అందించారు.
ప్రధాని మోదీకి సినీ ప్రముఖుల విషెస్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జాతీయ విలువలు, ప్రజాస్వామ్యం విధానం పట్ల మీ విధేయత ఆదర్శప్రాయం. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను“
-రామ్‌నాథ్ కోవింద్
“దేశ సేవ పేదల సంక్షేమానికి జీవితం అంకితం చేసిన ప్రియ ప్రధానమంత్రి మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో భారత మాతకు సేవ చేసే అవకాశం అభించడం మా అదృష్టం. మోడీజీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు అభించాలని కోరుకుంటున్నాను“
-అమిత్‌షా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చురుకైన నాయకత్వం. ధృఢ చిత్తం, నిర్ణయాత్మక చర్యలతో భారత్ అమితంగా అభివృద్ధి చెందింది. ఆయనకు ఆరోగ్యం. ధీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నాను“
-రాజ్‌నాథ్ సింగ్
“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.“
-రాహుల్ గాంధీ
“మీకు అమిత సంతోషపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను“
–
అరవింద్ కేజ్రీవాల్
“గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీగారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ ఘనమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వంలో మన భరతమాత శ్రీ అరబిందో కలలు కన్న తన నిజమైన స్ఫూర్తి శిఖరాలను తాకుతుందని ఆశిస్తున్నా“
-పవన్ కల్యాణ్
“ప్రియమైన ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో సంవత్సరాలపాటు దేశానికి మీరు ఉన్నతమైన సేవలందించాలని కోరుకుంటున్నా“
– చిరంజీవి
“ప్రధానమంత్రి మోదీగారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా“
– మోహన్ లాల్
“గౌరవ ప్రధానమంత్రి మోదీగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ స్ఫూర్తివంతమైన, దృఢమైన నాయకత్వం, దార్శనికత ఎంతో మార్పు తీసుకొచ్చింది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా“
– మహేష్ బాబు
“గౌరవ ప్రధానమంత్రి మోదీగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఫిట్‌నెస్ మీద మీరు చూపించే శ్రద్ధ నాకు ప్రతిరోజూ స్ఫూర్తి కలిగిస్తుంది. మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటున్నా“
– రకుల్ ప్రీత్