వాహనం లోయలో పడి 8 మంది మృతి

నందర్బార్ (CLiC2NEWS): మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు… జిల్లాల్లోని తోరణ్మాల్ ఘాట్లో ఒక ప్రయివేటు వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మరణించారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఈ వాహనంలో 24 మంది ప్రయాణిస్తున్నారు. ఘాట్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న రహదారిపై వాహనం ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
విషయం తెలిసిన వెంటనే స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పలువురు క్షతగాత్రులను స్థానిక తోరణ్మాల్ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.