హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల్లో 8 మంది మృతి
షిమ్లా (CLiC2NEWS): హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకొని 8 మృతి చెందారు. మరో 8 గల్లంతయ్యారు. రాష్ట్రంలోని కులు జిల్లాలో నలుగురు, లాహౌల్ – స్పితి జిల్లాలో ముగ్గురు, చంబా జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ సుదేష్‌కుమార్ మోక్త బుధశారం తెలిపారు.
కొండచరియలు విరిగిపడడంతో 60 వాహనాలు చిక్కుకుపోయాయని, చాలా ప్రాంతాల్లో రోడ్లు తిన్నాయి. సిమ్లా నగరంలోని వికాస్ నగర్‌లో కొండచరియలు విరిగిపడి కారుపై పడ్డాయి. మరో వైపు షిమ్లా వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.