పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

జంగారెడ్డిగూడెం (CLiC2NEWS): ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వంతెన పైనుండి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 9 మంది మృతిచెందారు. ఈ ఘటనలో మరి కొందరు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి జల్లేరు వాగులో పడిపోయింది. ప్రమాదసమయంలో బస్సులో 47 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు . ఈ ప్రమాదంలో పలురురికి తీవ్ర తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుల్లో ఆర్టీసీ డ్రైవర్ చిన్నారావు, పొడపాలి దుర్గ (తాడువాయి), కేత వరలక్ష్మి (ఎ.పోలవరం), ఎ మధుబాబు (చిన్నంవారిగూడెం)ను పోలీసులు గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.