ఎస్ఎల్‌బిసి టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది.. కొనసాగుతున్న సహాకచర్యలు

నాగర్ కర్నూల్ (CLiC2NEWS): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( ఎస్ఎల్‌బిసి) టన్నెల్ లో 8 మంది సిబ్బంది శనివారం జరిగిన ప్రమాదంలో లోపలే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్‌లో 14 కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలిపోయి ప్రమాదం చేటుచేసుకుంది. ఆప్రాంత మంతా బురద నీరు భారీ గా చేరుకోవడంతో లోపలికి ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ఆటంకం కలుగుతుంది. 120 మంది ఎన్‌డిఆర్ ఎఫ్ , 24 మంది ఆర్మి, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్ , 24 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సొరంగంలో 13.5 వద్ద బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నట్లు సమాచారం. టన్నెల్‌లో 14 కిలోమీటరు వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోవడంతో ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్క బల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 8 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. నేవీ బృందం కూడా ఈ రోజు రాత్రికి చేరుకోనున్నారు.
టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం..