TS: 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే: కెటిఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి నూతన జోనల్ వ్యవస్థ ద్వారా విద్యా,ఉద్యోగావకాశాల్లో సమాన వాటా దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తప్పక చదవండి: TS: నేటినుంచి అమల్లోకి కొత్త జోనల్ వ్యవస్థ