దళిత సింహం.. మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాదరావు మృతి

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన కు చెందిన మాజీ మంత్రి మోకా  విష్ణు ప్రసాదరావు(90) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈయ‌న 1930 అక్టోబ‌రు 28 కాట్రేనికోన‌లో రైతుకుటుంబ‌లో జ‌న్మించారు. బాల్యం నుంచి అంబేడ్క‌ర్ ఆలోచ‌నా విధానాల‌కు ఆక‌ర్శుతులై.. ఆయ‌కు ఏకల‌వ్య శిష్యుడిగా వెలుగొందారు. అంబేద్క‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఆయ‌న స‌భ‌ల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాట్రేనికోన గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పలు దపాలుగా బాధ్యతలు నిర్వహించిన ఈయన సర్పంచ్ గా పనిచేస్తూ 1972 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున అల్లవరం (ఎస్సీ రిజర్వడ్) నియజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీచేసి గెలిపొందారు. తదనంతరం 1978లో నియోజక వర్గాల పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పడిన ముమ్మిడివరం (ఎస్సీ రిజర్వడ్) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపొంది మార్కెటింగ్, గిడ్డంగులు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.1983లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) తరపున పోటి చేసి వాల్తాటి రాజా సక్కుబాయి(టిడిపి) పై ఓటమి పాలయ్యారు. తదనంతర పరిణామాల్లో క్రియాశిలక రాజకీయాలకు.దూరమయ్యారు. ఇంటి వద్దనే నిరాడంబర జీవితం గడిపారు. కేవలం ఎమ్మెల్యె కు ఇచ్చే పెన్షన్ పైనే ఆధారపడి జీవనం సాగించారు. మంత్రిగా పని చేసినా ఎటువంటి అర్బటాలకు పోకుండా ఎక్కడికి వెళ్ళినా సొంత వాహనం స్కూటర్ పైనే తిరిగేవారు. కుమారుడు మోకా ఆనంద సాగర్ తెలుగు దేశం పార్టీలో క్రియాశిలకంగా వ్యవహరిస్తున్నారు. విష్ణు ప్రసాదరావు హాయములో బడుగు, బలహీన వర్గాలకు అధిక సంఖ్యలో ఇండ్ల స్థలములు, పట్టాలు ఇప్పించటం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే కుడా ఈయన ఇచ్చినన్నీ ఇల్లు స్థలాలు ఇచ్చి వుండరంటే అతిశయోక్తి కాదు. ఈయన హాయములొనే ముమ్మిడివరం కు గవర్నమెంట్ ఆసుపత్రి, కోర్టు వచ్చాయి. మురముళ్ల రాఘవేంద్ర వారధి నిర్మాణం జరిగింది. నియోజక వర్గానికి ఇన్ని మంచి పనులు చేసినా, అధిక సంఖ్యలో ఇల్లు పట్టాలు ఇప్పించినా ఎన్నడూ పబ్లిసిటీ కోసం పాకులాడలేదు. కనీసం ఈయన ఇళ్ల పట్టాలు పంచిన ఏ ఒక్క ప్రాంతానికి కూడా ఈయన పేరు పెట్టుకోలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఈయన ఎంత గొప్ప వ్యక్తో.. ఎంత గొప్ప నాయకుడో… ఈ రోజుల్లో నాయకులకి పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ… కానీ ఈయన అలా కాదు.. నిరాడంబరంగా బ్రతకటమే ఈయన లైఫ్ స్టయిల్.. ఇప్పుడున్న చాలామంది నాయకులకు ఈయనే ఆదర్శం.. ఇది కాదనలేని సత్యం… స్వర్గీయ దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో ఆయన అమలాపురం వచ్చినపుడు కాట్రేనికోన సర్పంచ్ గా ఉన్న విష్ణు ప్రసాద్ రావు కోనసీమ లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయనకు వివరించారు.అనంతరం సంజీవయ్య ఆయనను ప్రోత్సహించారు.ఇందిరా గాంధీ కు ప్రేమ విధేయుడు.1977లోక్ స‌భ ఎన్నికల్లో అమలాపురం నుంచి కుసుమ కృష్ణ మూర్తి ని బరిలో కి దింపి ఎంపిగా విజయానికి కృషి చేశారు.1982లో ఎన్ టి ఆర్ ఆయనను తెలుగు దేశం పార్టీ లో కి ఆహ్వానిం చగా సున్నితం తిరస్కరించారు.నేను 1985-1995 కాలంలో అమలాపురం లో పాత్రికేయునిగా పని చేసినప్పుడు ఆయనను తరచుగా కలిసేవాడిని.కోనసీమలో దళితుల కు కొండంత అండగా ఉన్న విష్ణు ప్రసాద్ రావు మరణం తీరనిలోటు.

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.