కంటైన‌ర్ బోల్తా: ఆరుగురు యువ‌కులు, 13 ప‌శువులు మృతి

అమ్రోహా:: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అమ్రోహా జిల్లా గ‌జ్రౌలాలో సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ ప‌శువుల‌ను తీసుకెళ్తున్న కంటైన‌ర్ ప్ర‌మాద‌వ‌శాత్తు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు యువ‌కులు ప్రాణాలు కోల్పోగా, 13 ప‌శువులు మృతి చెందాయి. స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్నారు. రోడ్డుపై ప‌డి ఉన్న ప‌శువుల క‌ళేబరాల‌ను క్రేన్ స‌హాయంతో ప‌క్క‌కు తొల‌గించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.