షేక్.బహర్ అలీ: సైలెంట్ కిల్లర్ అధిక రక్తపోటు

ప్రస్తుతం అన్ని దేశాల ప్రజలు ఇదే వ్యాధితో ఎక్కువగా వున్నారు.దీనికి కారణం కరోనాకి ముందు ఉన్న పరిస్థితులు కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. కరోన వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిపోయి ఉన్న ఉద్యోగాలు పోయి, ఉద్యోగం చేసుకుంటున్న సాధారణ వ్యక్తి నుండి ఉన్నత స్థాయి అధికారులకు కూడా జీతాలు రాక ఉన్న డబ్బులతో ఒక పూట ఆహారం తిని, ఒక పూట తినకుండా ఉండటం, మరియు ఆహారం దొరక చాలా మంది పస్తులుండటం, అదే సమయంలో ఏదైనా ఆహారం దొరికితే ఎక్కువగా తినటం, సరిగ్గా ఉద్యోగాలు లేక పనులు దొరకక చాలా మందికి ఒత్తిడి ఎక్కువై రక్తపోటు రేట్ దేశంలో పెరిగిపోయింది.
అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది.తెలుసుకుందాం…
Hypertention..మన శరీరంలో అన్ని అవయవాలు రక్తం ద్వారా పోషించబడుతాయి. ప్రమాదకర వ్యాధులలో రక్తపోటు ఒకటి. సైలెంట్ కిల్లర్ గా ప్రాణాలు తీసే వ్యాధి. కరోనాకి ముందు 20 శాతం మంది అధిక రక్తపోటుతో మరణించారు. కానీ కరోన తరువాత కనీసం పెరగవచ్చును. ఏందుకంటే చాలా మంది కరోన లాక్ dowan సమయంలో గుండె పోటుతో మరణించారు, అంటే వారికి బీపీ కూడా ఉండవచ్చును. దాని వలన గుండె మీది ప్రభావం పడుతుంది. అలా కూడా మరణించారు.
రక్త ప్రసరణకు కేంద్రం గుండె. అది కోట్లాది రక్తకేశ నాళికల సహాయంతో శరీరంలో రక్తాన్ని ప్రసరింపజేసే (circulation) చేసే పని చేస్తుంది. గుండె ఒక పంపులాంటిది. ఇలా రక్తం ప్రవహించినపుడు ధమనుల గోడలపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడిని రక్త పోటు లేదా బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది రెండు రకములుగా వుంటుంది. 1. systolic pressure. 2.diostolic pressure అంటారు.
గుండె ముడుచుకున్న ప్రతిసారి 70-80 మీ.లీ. రక్తనాళాల్లో కి చేరుతుంది. దీనినే systolic pressure అంటారు. గుండె ముడుచుకొని ఒకసారి రక్తాన్ని పంపు చేసిన తరువాత వెంటనే విచ్చుకొని రక్తాన్ని నింపుకుంటుంది. గుండె విప్పుకున్న సమయంలో గుండె నుండి రక్తం పంపు అవదు. అయితే అంతకుముందు రక్తనాళాల్లో పంపు చేయబడిన రక్తం రక్తనాళాల్లో ప్రవేసిస్తూనే ఉండి రక్తనాళాల గోడల మీద ఒత్తిడిని కలిగిస్తునే ఉంటుంది. ఇలా గుండె విప్పుకొని ఉన్నపుడు రక్తనాళాల మీద ఉండే ప్రెషర్ ని diostolic pressure అంటారు. రక్తపోటు ఉండవలసిన దానికంటే ఎక్కువగా వున్న దానిని అధిక రక్తపోటు hypertention అంటారు.
1.మాములుగా ఆరోగ్యవంతులలో రక్తపోటు 120 mm of hg./ 80 mm of Hg గా ఉంటుంది.
2.ఆరోగ్యవంతులలో systolic 100 -140, diostolic 60 – 90 mm of Hg గా ఉంటుంది. ఏ కారణం చేతనైన సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే అధికరక్త పోటు అని అంటారు.
అధిక రక్తపోటు రావటానికి మన అస్తవ్యస్తమైన దిన చర్య.
1. రక్తపోటు పెరగటానికి ముఖ్య కారణం ఎక్కువగా కొవ్వులు చేరటం, వేపుడు పదార్దాలు, ఎండు మిర్చి, మసాలా వుండే పదార్దాలు, మైదా, ఉప్పు, పంచదార ఎక్కువా తినటం.
2. దాదాపు 90 శాతం వ్యక్తులలో రక్తపోటు రావటానికి కారణం తెలియకపోవడం. ఒక 15 శాతం రోగులలో కారణాలు తెలుస్తాయి.
3. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కూల్డ్రింక్స్, ఎక్కువగా తినటం, తాగటం.
4. అయితే కొందరిలో వంశపారంపర్యంగా కూడా వస్తున్నట్టు గమనించారు.
5. మద్యం, పొగ, తాగటం. టీ, కాఫీ ఎక్కువ తాగటం.
6. మూత్రపిండాల వ్యాధులు ఉన్నపుడు, అధికరక్త పోటు కలుగుతుంది.
7. తగినంతగా ఆహారం తీసుకోపోవటం, ఆహార లోపం వలన కూడా రావటం జరుగుతుంది.
8. యూరిమియా… రక్తంలో uric ఆసిడ్ పెరగటం వలన కూడా అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
9. ఎక్కువగా రాత్రులు మేల్కొవటం, సరిగ్గా నిద్ర లేకపోవటం, మానసిక ఒత్తిడి, ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడి, చికాకులు, చింతలు, కుటుంబ కలహాలు, వ్యాపార లావాదేవీల ఒత్తిడి, ఎక్కువగా ఉండటం.
10. శరీర శ్రమ లేకపోవటం మరియు లావు ఉన్నవారిలో అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది.
11. శక్తికి మించి పని చేయటం, శ్రమ ఎక్కువగా అవ్వటం వలన కూడా వస్తుంది.
అధిక రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు వస్తాయి.
1. మెదడులో రక్తం గడ్డ కట్టటం, మెదడులో రక్త నాళాలు దెబ్బతినటం, పక్షవాతం, గుండెనొప్పి, మూత్రపిండాలు చెడిపోవటం, ముక్కు నుండి రక్తం కారటం, జరుగుతాయి.
ఈ క్రింది విధంగా ఆహారనియమలు పాటించి ఈ సమస్యకు పరిష్కరించుకోవచ్చు..
1. అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే మద్యం, మాసము, ఉప్పు, కారం తగ్గించుకోవాలి.
2. దూమపానం, గుట్కా, panparag, జర్ధా, అన్ని మనివేయాలి.
3. తెలికగా అరుగుదల అయ్యే కార్బైహైడ్రేట్స్ తో కూడిన ఆహారం తీసుకోవాలి.
4. తిన్న ఆహారం అరగక ముందు తినకూడదు. తగినంత పీచుపదార్దాలు సేవించడం ఉత్తమం.
5. పప్పులు, దంపుడు బియ్యం, వండేటపుడు ఉప్పు వేయరాదు దీని వలన సోడియం మోతాదు పెరిగి ఆహారంలో ఉన్న పదార్దాలలో శరీరానికి కావలసిన బి compex నసిస్తుంది.
ఆహారంలో మజ్జిగ, గోధుమలు, వెల్లుల్లి, ఆకు కూరలు, తర్బూజా, బొప్పాయి, ఎండు ఖార్జుర, తేనె, ఉసిరి, ఉల్లిపాయలు, సొరకాయ, apple, బత్తాయి, దానిమ్మ, అరటిపండు, ద్రాక్ష, సపోటా, మామిడి, బేరిపండు, సేనగలు, రాగులు, సోయాబీన్, మొక్కజొన్న, పెసలు, మొలకెత్తిన విత్తనాలు, బార్లీ, జొన్నలు, క్యారెట్, పాలకూర, టమాటా, బెండకాయ, బీరకాయ, తోటకూర, మెంతికూర, బెల్లం, కొవ్వు లేని పాలు, ఇవి తినటం ఆరోగ్యానికి మంచిది.
రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసి నానపెట్టి ఉదయం దానిని అర గ్లాస్ వరకు మరిగించి వడ పోసి ఒక టీ స్పూన్ తేనె కలిపి పరిగడుపున తాగాలి.
రాత్రి తీసుకొనే ఆహారం తో గ్యాస్ ఉత్పత్తి కాకుండా చూసుకోండి.
ఉదయం నడక, స్విమ్మింగ్, జాగింగ్, యోగ, ధ్యానం చేయండి. ఎదో ఒక వ్యాయామం చేయడం వలన అధిక రక్తపోటు తగ్గుతుంది.
-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు