ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు నెలాఖరు వరకు పొడిగింపు

హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) చెందిన నిరుద్యోగులు సబ్సిడీ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెలాఖరు వరకు పొడిగించినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. ఎస్సీ కులాల్లోని పేదలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. వ్యవసాయ భూమి అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ కనెక్షన్లకు నేరుగా రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఎస్సీ కులాల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. ఎస్సీ కులాల్లోని పేదలు, నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకోసం ప్రభుత్వం రూ.786 కేటాయించిందని చెప్పారు. ఇందులో రుణాల రాయితీకి రూ.500 కోట్లు, బ్యాంకులవాటా రూ.279 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.7 కోట్లు అని చెప్పారు.