అప్రమత్తతోనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు: మంత్రి పువ్వాడ

ఖమ్మం: ప్రయాణంలో వాహనఛోదకులు ఎప్పడూ అప్రమత్తంగా ఉంటేనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో బైక్ ర్యాలీని శనివారం మంత్రి ప్రారంభించారు. సమష్టి కృషితో భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.