నకిలీ పాసు పుస్తకాలతో రూ. 2 కోట్ల రుణాలు!.. 153 మందిపై కేసులు

పెద్దపల్లి: జిల్లాలో నకిలీ పాసు పుస్తకాలతో రుణం పొందిన 153 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో నిందితులంతా దాదాపు రూ. 2 కోట్ల రుణాలు అక్ర‌మంగా పొందారు. ఈ రుణాలు 2016-18 మధ్య కాలంలో నకిలీ పుస్తకాలతో బ్యాకు అధికారుల‌ను మోసం చేసి పొంద‌రు. కాగా అనుమానం వ‌చ్చి బ్యాంకు మేనేజర్‌ పరిశీలించగా అవి పుస్తకాలు నకిలీవని తేలాయి. ఈ మేర‌కు బ్యాంకు మేనేజ‌రు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.