తూ.గో జిల్లాలో ఆరు కాళ్ల‌తో వింత దూడ జననం!

పిఠాపురం: భూమిపై నిత్యం ఎక్కడో ఒక చోట ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. మూజు కాళ్ల కోళ్లు, రెండు తలల పాములు, మూడు కాళ్ల ఆవులు ఇలా పుడుతూనే ఉంటాయి. అయితే, ఇలాంటి వింత సంఘటన ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం రామపర్తి గ్రామానికి చెందిన రైతు సూరారెడ్డి ఇంట్లో ఆరు కాళ్లతో వింత దూడ జన్మించింది. బుధ‌వారం రాత్రి ఈ వింత దూడ జ‌న్మించింది. ప్రతి రెండు కాళ్ళ మధ్యలో మరోక కాలు ఉండటంతో మొత్తం ఆరు కాళ్లతో జన్మించింది. వింత దూడ జన్మించిందన్న‌ విష‌యం ఆ నోటా ఈనోటా ఊరంతా తెలియడంతో ఆ వింత దూడను చూసేందుకు జనం భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. రైతు ఇచ్చిన సమాచారంతో దూడను పరిశీలించిన పశుసంవర్ధక శాఖ అధికారులు జన్యుపరమైన లోపాల వల్ల‌నే ఇలాంటి దూడలు జన్మిస్తాయని.. ఇందులో వింతేం లేదని చెప్తున్నారు. ఇలా జన్మించిన దూడలు త్వరగా చనిపోయే అవకాశముందన్నారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.