మ‌ళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

హైదరాబాద్‌ : చ‌మురు కంపెనీలు నిత్యం ధ‌ర‌లు పెంచుతూ చుక్క‌లు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచారు… తాజాగా వంట గ్యాస్‌ ధరలను గురువారం పెంచాయి. వంటగ్యాస్‌పై రూ.25 బాదాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.794కు ఎగసింది. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఫిబ్రవరి నెలలో మూడోసారి కావడం గమనార్హం. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా.. 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. మొత్తం మూడుసార్లు సిలిండర్‌పై చమురు కంపెనీలు రూ.100 బాదాయి.

Leave A Reply

Your email address will not be published.