ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 82 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 889585కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 611గా ఉంది. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదు. అదే సమయంలో 74 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 881806 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 7168 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు.