ప్లాస్మా దానానికి అందరూ సిద్ధం కావాలి: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

వరంగల్: కరోనా మహమ్మారి నియంత్రణలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్లాస్మా దానంపై నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులతో శనివారం ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, సమయానికి మందులు వేసుకుంటున్నారా? అని బాధితునికి స్వయంగా ఫోన్ చేసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు… కరోనా పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలని బాధితులకు ఊరటనిచ్చారు. హోంక్వారంటైన్ లో ఉన్నవారు 17 రోజుల వరకు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు తప్పకుండా ధరించి ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలని సూచించారు.
పాజిటివ్ గా నిర్దారణై ఎలాంటి లక్షణాలు లేని వారు ఇంట్లో ఉండడానికి సౌకర్యాలు లేని పేదవారు నర్సంపేటలోని ఐసోలేషన్ కేంద్రానికి వచ్చి ఉండొచ్చు అని బాధితులను కోరారు. వేడినీళ్లు, రెండుపూటల కషాయం, రుచికరమైన భోజన సౌకర్యంతో పాటు వైద్యుల పర్యవేక్షణ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఎంతమందికైనా ఐసోలేషన్ కేంద్రంలో సౌకర్యాలు కల్పిస్తామని, వీలైతే మరో 200 పడకలతో అదనంగా మరొక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 1035 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనా నుండి కొలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానానికి సిద్ధంగా ఉండాలని కోరారు.
ప్లాస్మా దానంతో కరోనాపై యుద్ధం చెయ్యొచ్చు.
ప్లాస్మా దానం చేయాలని ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా వారి వివరాలను ఈ (9959838414, 9381333314, 8008199191) నెంబర్లకు నేరుగా ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు నియోజకవర్గంలోనే కాక రాష్ట్రంలోనే ఎక్కడున్నా వారికి ప్లాస్మా డోనర్స్ యొక్క వివరాలను అందచేయడం జరుగుతుంది. నమోదు ప్రక్రియ పూర్తైన అనంతరం “ప్లాస్మా దాన” శిబిరాన్ని కూడా త్వరలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలియచేశారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3400 యూనిట్ల రక్తాన్ని సేకరించి పభుత్వానికి అందచేశాము. ఇంకా దశల వారిగా రక్తధాన శిబిరాలు నిర్వహించబడతాయి. దాతలకు ముందుగా కరోనా టెస్టు నిర్వహించి, నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతనే రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే నమోదుచేసుకున్న వారు ఎప్పుడైనా, ఎక్కడైనా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే స్ఫూర్తితో ప్లాస్మా దానానికి కూడా సిద్ధంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి రక్తదానానికి ముందుకు వచ్చిన దాతలందరికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.