పార్లమెంట్‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్‌

న్యూఢిల్లీ: పార్లమెంటులోనూ మంగళవారం నుంచి కొవిడ్‌ టీకా పంపిణీ కోసం ప్రత్యేకంగా రెండు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్క‌డ ఎంపిల‌తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా టీకా తీసుకునే అవకాశం ఉన్నది. కాగా దేశవ్యాప్తంగా రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. కాగా శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2.06 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాగా, నేటి నుంచి పార్లమెంటు రెండో విడుత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.