మహారాష్ట్రలో కొత్త‌గా 14,317 కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా రాష్ట్రంలో 14,317 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,66,374కు చేరింది. అలాగే తాజాగా రాష్ట్రంలో 57 మర­ణాలు నమో­ద­య్యాయి. రాష్ట్రంలో తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి మొత్తం మర­ణాల సంఖ్య 52,667కు చేరింది. రాష్ట్రంలో కొత్త‌గా 7,193 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,070 యాక్టివ్ ‌కేసులు ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.