ఈరోజు పసిడి ధరలు ఎంతంటే..

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో బంగారం ప్రియులకు అన్నీ శుభవార్తలే.. ఈ మధ్యకాలంలో దేశంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. తగ్గిన ధరలను బట్టి ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం విలువ.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.41,850కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ. 45,650కి చేరింది. ఇక బంగారంతో పాటుగా వెండి కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,500 తగ్గి రూ. 70,700కి చేరింది.