ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య

సుపాల్‌: బిహార్‌లో ఐదుగురు కుటుంబ‌స‌భ్య‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. సుపాల్‌ జిల్లా రాఘోపూర్‌ ఠాణా పరిధిలోని గడ్డీ గ్రామంలో ముగ్గురు పిల్లలతో సహా దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా మూసిన త‌లుపు తెరుచుకోక‌పోవ‌డంతో.. దుర్వాస‌న రావ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చి చుట్టుప‌క్క‌ల వారుతు తలుపులు తెరిచి చూశారు. ఇంట్లో ఐదుగురి మృతదేహాలు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాయి. ఈ స్థానికంగా సంచలనంగా మారింది. ఎస్సీ మనోజ్‌కుమార్‌ గ్రామానికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. అయితే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.