త్వ‌ర‌లో 50 వేల ఉద్యోగాల భ‌ర్తీ: హ‌రీష్ రావు

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో 50 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు ఆర్ధిక మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. గురువారం తెలంగాణ శాస‌న స‌భ ప‌లు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేల‌, మాజీ ఎమ్మెల్యేల‌ వైద్యం కోసం 10 లక్షల వరకు సాయం అందేలా చట్ట సవరణ చేయాలనీ అలాగే పెన్షన్ ని కనీసం 30 నుండి 50 వేలకు పెంచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక గరిష్ట పెన్షన్ 50 నుండి 70 వేలకు పెంచనున్నారు. ఇలా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 61 యేండ్ల వరకు వయో పరిమితి పెంచుతూ సర్కార్ బిల్ ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుల‌కు స‌భ ఆమోదం తెలిపింది.
ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. “ మేనిపెస్టోలో ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీని అమ‌లు చేశాం. మెరుగైన ఆరోగ్య ప్ర‌మాణాల దృష్ట్యా ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుపెంపు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌సు 62 ఏళ్లు. పిఆర్సీ క‌మిష‌న్ నివేదిక‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నాం. వ‌యోప‌రిమితి పెంపు వ‌ల్ల ఉద్యోగ ఖాళీల‌కు ఇబ్బంది లేదు. ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పిస్తూ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాం. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని సిఎం నిర్ణ‌యించారు. ఖాళీ ఉద్యోగాల భర్తీ చేస్తాం త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం“ అని హరీష్ రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.