తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,052 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,581కి చేరింది. మహమ్మారి బారినపడి నిన్న ఏడుగురు మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 1,772 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 778 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,06,678 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 16,118 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 406 కేసులున్నాయి.