మంథని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ

మంథని: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంథని పట్టణం లో వ్యాపార కూడలి లో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు, హోటల్ యజమానులు అప్రమత్తంగా ఉండాలని మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి పుట్ట శైలజ విజ్ఞప్తి చేశారు.
పట్టణంలో ప్రజలు కరోనా బారిన పడకుండా మాస్కులు శానిటైజర్ లు వాడాలని మున్సిపల్ ఛైర్పర్సన్ కోరారు. కరోనా సెకండ్ వేవ్. ప్రమాద కరంగా ఉందని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని పుట్ట శైలజ విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.