మలక్‌పేటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువకుల దుర్మరణం

హైదరాబాద్: రాజధానిలోని మలక్‌పేట గంజ్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి అటు వైపుగా వస్తున్న లారీ వెనుక చక్రాల కిందపడిపోయారు. లారీ ఇద్దరిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.