TS: థియేటర్ల నిర్వహణపై స‌ర్కార్ మార్గదర్శకాలు..

హైదరాబాద్ (clic2news): తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో స‌ర్కార్‌ నేటి రాత్రి నుంచి ఈ నెల 30 వరకు నైట్‌ కర్ఫ్యూ విధించిన సంగ‌తి తెలిసిందే. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.

  • తెలంగాణ‌లోని సినిమా థియేటర్లు (మల్టీపెక్స్‌లతో సహా) రాత్రి 8 గంటల వరకు మూసివేయాలి.
  • థియేటర్లలోని ప్రేక్షకులు, సిబ్బంది, సామగ్రి విక్రయించే సిబ్బంది త‌ప్ప‌ని స‌రిగా మాస్కులు ధరించాలి.
  • ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాలతోపాటు అక్కడక్కడ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
  • ప్రేక్షకులు భౌతిక దూరం పాటించేలా, రద్దీని నియంత్రించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
  • వేర్వేరు షోల్లోని ప్రేక్షకులను ఒకే సారి ఇంటర్‌ వెల్‌కు అనుమతించొద్దు.
  • షో ముగిసిన వెంటనే థియేటర్‌ పరిసరాలను వెంటనే శానిటైజ్‌ చేయాలి.
  • లోపల గాలి రీసర్క్యూలేట్‌ కాకుండా చూడాలి. గాలి దారాళంగా వచ్చిపోయేలా చూసుకోవాలి.
  • థియేటర్లలోని ఏసీలు 24-30 డిగ్రీల మధ్య ఉండాలి. తేమశాతం 40 నుంచి 70 శాతం ఉండేలా చూసుకోవాలి.

 (త‌ప్ప‌క చ‌ద‌వండి:  Telangana: సినిమా థియేటర్లు బంద్‌)

Leave A Reply

Your email address will not be published.