Corona: ఎపిలో 10 వేలు దాటిన కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. క‌రోనా సెకండ్‌ వేవ్ ఎపిలో క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. రోజువారి పాజిటివ్ కేసులు ప‌ది వేలలు దాటిపోయాయి. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 41,871 శాంపిల్స్ పరీక్షించగా 10,759 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేర‌కు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.
తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి ర‌కు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 997462కు పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 3,992 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 922977 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కేసులు 66944గా ఉన్నాయి.

24 గంట‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్‌తో 29 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 7541 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోవిడ్ బారిన‌ ప‌డి చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, కర్నూల్ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, అనంతపురం , వైఎస్ఆర్ కడప మరియు విశాఖపట్నం లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Leave A Reply

Your email address will not be published.