Proning: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోండిలా..: కేంద్రం సూచన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్ర్యతేకంగా సెకండ్ వేవ్‌లో కరోనా పేషెంట్లు ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆక్సిజన్ సరఫరా సరిగా లేక కొవిడ్ పేషెంట్లు మృత్యువాత పడుతుండటం అసలైన విషాదం. ఇలాంటి సమయంలో కొవిడ్ పేషెంట్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది.
`ప్రోనింగ్ (ప్రత్యేకమైన పొజిషన్లో పడుకొని ఊపిరి తీసుకోవడం) వల్ల శ్వాసతో పాటు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుచుకోవచ్చని చెబుతోంది. ముఖ్యంగా ఇంట్లోనే స్వల్ప లక్షణాలతోపాటు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఛాతి, పొట్టబాగంపై బరువు పడే విధంగా (బోర్లా ) పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ చేరుతుందనికేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ప్రోనింగ్గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ద్రువీకరణ పొందిందని పేర్కొంది.
రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 కంటే కిందికి పడిపోయినప్పుడే ఈ పని చేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్‌ను పరిశీలిస్తుండటం, ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర స్థాయిలను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు చూసుకుంటూ ఉండాలని స్పష్టం చేసింది. సరైన సమయంలో ప్రోనింగ్ చేస్తే ఎన్నో ప్రాణాలు నిలుపుకోవచ్చని కూడా తెలిపింది. ఈ మేరకు ప్రోనింగ్ ఎలా చేయాలో కూడా చెబుతూ కొన్ని వాటిని వివరించే ఫొటోలను ట్వీట్ చేసింది.
ప్రోనింగ్ ద్వార శ్వాస తీసుకునే విధానం..
- మొదట మంచంపై బోర్లా పడుకోవాలి
- ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో పెట్టాలి
- ఛాతి నుంచి తొడల వరకు ఒకటి లేదా రెండు దిండ్లను పెట్టవచ్చు
- మరో 2 దిండ్లను మోకాలి కింద భాగంలో ఉంచాలి
అలాగే ఈ కింది విధంగా వివిధ భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
జాగ్రత్తలు..
- భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు.
- తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్ చేయాలి
- పలు సమయాల్లో రోజులో గరిష్టంగడా 16 గంటల వరకు ప్రోనింగ్ చేయవచ్చు… (వైద్యుల సూచన మేరకు)
- హీద్రోగ సమస్యలు, గర్భిణులు వెన్నెముక సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి
Proning as an aid to help you breathe better during #COVID19 pic.twitter.com/FCr59v1AST
— Ministry of Health (@MoHFW_INDIA) April 22, 2021