Corona: ఎపిలో కొత్తగా 11,766 కేసులు.. 36 మరణాలు

అమరావతి (clic2news): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ కేసులు పెరిగిపోతున్నయి. రాష్ట్రంలో రోజువారి పాజిటివ్ కేసులు పది వేలలు దాటిపోయాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 45,581 శాంపిల్స్ పరీక్షించగా 11,766 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009228కు పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 4,441 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. వీరితో పాటు ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా నుంచి 927418 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 74231 ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్తగా మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 36 మంది మృతి చెందారు. కోవిడ్ బారిన పడి కోవిడ్ వల్ల నెల్లూరు లో ఆరుగురు, చిత్తూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణ లో నలుగురు, కర్నూల్ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, గుంటూరు మరియు విజయనగరం లలో ఇద్దరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 7579 మంది ప్రాణాలు కోల్పోయారు.