TS: వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ (CLiC2NEWS): వేసవి సెలవుల్లో కాలేజీలు క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలకు ఏప్రిల్ 27 నుండి మే 31వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు తీసుకోవద్దని, వేసవి సెలవులు ఇచ్చేదే విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసమని ఇంటర్ బోర్డు తెలిపింది. మే 6 లోపు కాలేజీలు విద్యార్థుల మార్కులు పంపకుంటే చర్యలు తీసుకుంటామంది. ప్రాక్టికల్స్ సాధ్యం కాకుంటే రికార్డ్ ఆధారంగానే మార్కులు అని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఎథిక్స్, హ్యుమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యూకేషన్ అసైన్‌మెంట్స్ మార్కులను ఫీజులతో ముడి పెట్టవద్దంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ అసైన్‌మెంట్ సమర్పించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.