Covaxin: తెలంగాణ‌కు స‌రిప‌డా టీకాలు ఇవ్వండి

భార‌త్ బ‌యోటెక్ సిఎండిని కోరిన సిఎస్ సోమేశ్‌కుమార్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): కొవిడ్ టీకాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌ని. వీలైన‌న్ని ఎక్కువ డోసులు అందించాల‌ని భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ను రాష్ట్ర స‌ర్కార్ కోరింది. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తో భార‌త్ బ‌యోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో కొవాగ్జిన్ టీకాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు భార‌త్ బ‌యోటెక్ ఎండీతో స‌మావేశమ‌య్యాను అని తెలిపారు. అంద‌రికీ ఉచితంగా టీకా ఇవ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో వీలైన‌న్నీ ఎక్కువ డోసులు రాష్ర్టానికి ఇవ్వాల‌ని కృష్ణ ఎల్ల‌ను సీఎస్ కోరారు. విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ట్రానికి ఎక్కువ డోసులిచ్చేందుకు భార‌త్ బ‌యోటెక్ సానుకూలంగా స్పందించింద‌ని సిఎస్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.